అతిరథమహారధుల సమక్షంలో చరణ్ 15 మూవీ ప్రారంభం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సంచలన డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు ఈరోజు హైదరాబాద్ లో అతిరథమహారధుల సమక్షంలో పూర్తి చేసుకుంది. సినిమా ప్రారంభోత్సవానికి రణవీర్ సింగ్, రాజమౌళి, చిరంజీవి, హీరో శ్రీకాంత్ , కియారా అద్వానీ , అంజలి , సునీల్ , దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. చరణ్ కు 15 మూవీ గా , దిల్ రాజు బ్యానర్ లో 50 వ చిత్రంగా తెరెకెక్కుతుండడం విశేషం. తాజా సమాచారం మేరకు ఈ క్రేజీ ప్రాజెక్టుకు ”విశ్వంభర” అనే టైటిల్‌ ను ఫైనలైజ్‌ చేశారని టాక్‌.

ప్రస్తుతం రామ్ చరణ్ ..రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను వచ్చే యేడాది.. జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.