సుప్రీంకోర్టు తీర్పునే మార్చేస్తారా?

Sourav Ganguly
Sourav Ganguly

హైదరాబాద్‌: భారత మాజీ కెప్టెన్‌, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పదవికాలం పొడిగింపుపై బిసిసిఐ పాలకవర్గం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిని లోధా ప్యానెల్‌ కార్యదర్శి విమర్శించారు. బీసీసీఐలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై లోధా కమిటీ ప్యానెల్‌ కార్యదర్శి గోపాల్‌ శంకర నారాయణన్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు రూపొందిన బోర్డు రాజ్యాంగానికి మార్పులు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఖవాస్తవానికి ఇలాంటి ప్రయత్నాలు కోర్టు తీర్పును అపహాస్యం చేయడమే అవుతుంది.ఒకవేళ బోర్డు సభ్యులు చేస్తున్న ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు వృథా అయినట్టే. మళ్లీ పాత రోజులకు వెళ్లినట్టే అవుతుంది.మా ప్రయత్నాలను అడ్డుకోలేదు కాబట్టి మరిన్ని సవరణలు చేస్తామంటారు. బోర్డు ప్రతిపాదనలకు ఏకగ్రీవం లేక మెజారిటీ సభ్యుల ఆమోదం పొందినా కూడా ఈ విషయంలో కల్పించుకునేందుకు సుప్రీం కోర్టుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా అన్నీ కోర్టు అనుమతి తర్వాతే అమలయ్యాయిగ అని శంకరనారాయణన్‌ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/