ఒంటరితనంతో మెదడులో మార్పులు

మానసిక వికాసం

loneliness
loneliness

మీరెంత సోషల్‌గా ఉంటారనేది మీ సోషల్‌ మీడియాలనే కాదు, మెదడు నెట్‌వర్కులోనూ కనిపిస్తుంది అంటున్నారు. న్యూరోసైన్సు సొసైటీకి చెందిన నిపుణులు.

మెదడులోని మీడియల్‌ ప్రిఫ్రాంటల్‌ కార్టెక్స్‌ వ్యక్తి ఆలోచనలనీ ప్రతిబింబిస్తుందట. అంటే మనం ఒంటరిగా ఉన్నామా..పదిమందితో కలిసి ఉం టున్నామా అన్న విషయం మెదడు భాగం పనితీరులో కనిపిస్తుందన్నమాట.

ఇందుకోసం సోషల్‌గా చురుగ్గా ఉండేవాళ్లనూ, ఒంటరిగా ఉండేవాళ్లనీ ఎంపిక చేసి ఎమ్మారై స్కాన్‌ ద్వారా వాళ్ల మెదడు పనితీరుని పరిశీలిం చారట.

అందులో సోషల్‌గా ఉండే వాళ్లలో తమ గురించీ సన్ని హితుల గురించీ ఆలోచించేటప్పుడు ఆ భాగం ఒకేలా స్పందిస్తే, సెలబ్రిటీలూ చుట్టుపక్కలవాళ్ల గురించి ఆలోచించేటప్పుడు మరోరకంగా స్పందించిం దట. కానీ పెద్దగా తేడా ఏమీ లేదట.

అదే ఒంటరిగా ఎవరి తోనూ కలవకుండా ఉండే వాళ్ల ఆలో చనల్లో కేవలం వాళ్ల గురించి ఆలోచిం చిప్పుడు మెదడు స్పందించే తీరు.

వేరే వాళ్ల గురించి ఆలో చించిన ప్పుడు స్పందిం చే తీరుకి పూర్తి భిన్నంగా ఉందట.

దీన్ని బట్టి ఎవరి తో కలవ కుండా ఒంటరి గా గడపడం వల్ల వాళ్ల మెదడులోనూ క్రమేణా మార్పులు చోటుచేసుకుంటాయన్న మాట.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/