మోడీ వైజాగ్ టూర్ షెడ్యూల్ లో మార్పులు

ప్రధాని మోడీ ఈ నెల 12 న ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11న సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచే రూ. 10,742 కోట్ల విలువైన 7 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు… ఇప్పటికే పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ లో చిన్న మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

మోడీ వైజాగ్ టూర్ లోకి ఇప్పుడు అనూహ్యంగా రోడ్ షో వచ్చి చేరింది. ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖకు రాగానే నగరంలో సాయంత్రం రోడ్ షో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. తద్వారా ప్రధాని మోడీ విశాఖకు, అలాగే ఏపీకి చేస్తున్నసాయాన్ని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్లో ఈ రోడ్ షో లేదు. కానీ చివరి నిమిషంలో బీజేపీ నేతలు పట్టుబట్టి దీన్నిచేర్పించినట్లు తెలుస్తోంది. ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈరోజు ప్రకటించారు. మోడీ తన టూర్ లో ఏడుకీలక ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయబోతున్నారు. వీటిలో పలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కీలకమైన విశాఖ రైల్వే జోన్ కు మాత్రం ప్రధాని శంఖుస్ధాపన చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ తన ప్రెస్ మీట్లో వెల్లడించారు.