జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్2

Chandrayaan-2
Chandrayaan-2

శ్రీహరికోట: చంద్రయాన్ 2 ప్రాజెక్టులో మరో కీలకఘట్టం చోటుచేసుకుంది. చంద్రయాన్ 2 చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది.చంద్రయాన్2ను ప్రయోగించిన 29 రోజుల తర్వాత ఈ వాహకనౌక చందమామ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో మేక్ ఆర్ బ్రేక్గగా వ్యవహరించే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ సందర్భంగా చంద్రయాన్2 వేగాన్ని తగ్గించిన శాస్త్రవేత్తలు.. వాహకనౌకను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. ఇందుకోసం నౌకలోని ద్రవ ఇంజిన్ ను మండించారు. ఈ నెల 21, 28, 30 ల్లో ఇదే తరహా ప్రక్రియను చేపట్టి వాహకనౌకను చంద్రుడికి 150 కిలోమీటర్ల సమీపానికి తీసుకెళతారు. ఈ వాహకనౌకలోని ల్యాండర్ వచ్చే నెల 7న చంద్రుడిపై ల్యాండ్ కానుంది. అనంతరం అందులోని రోవర్ ముందుకు దూసుకుపోనుంది. అనంతరం అక్కడి ఖనిజాలను, ఇతర వనరులను విశ్లేషించి సమాచారాన్ని ఆర్బిటర్, ల్యాండర్ ద్వారా భూమికి చేరవేయనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/