జూలై 15న నింగిలోకి చంద్రయాన్‌-2

chandrayaan-2
chandrayaan-2

హైదరాబాద్‌: చంద్రయాన్‌-2 మిషన్‌ను జూలై 15వ తేదీన చంద్రునిపైకి పంపనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ తెలిపారు. జూలై 15న తెల్లవారుఝామున 2 గంటల 51 నిమిషాలకు ప్రయోగించనున్నారు. దీనిని జిఎస్‌ఎల్వీ మార్క్‌ త్రీ రాకెట్‌ ద్వారా ప్రయోగిస్తారు. దీని బరువు సుమారు 3.8 టన్నులు ఉంటుంది. 13 ఉపగ్రహాలను చంద్రయాన్‌-2 నింగిలోకి మోసుకెళ్లనుంది. సెప్టెంబరు 6 లేదా 7న చంద్రయాన్‌-2 రోవర్‌ చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుందని శివన్‌ తెలిపారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఖరీదు 603 కోట్లు అని ఇస్రో ఛైర్మన్‌ చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/