పెద్దల లక్షణాలు

ఆధ్యాత్మికం

Chandrasekharendra Saraswati Swamy
Chandrasekharendra Saraswati Swamy

పెద్దలకు పెద్ద పీట వేసింది సనాతన హిందూ ధర్మం. పెద్దలను గౌరవించి , వారి సలహాను అనుసరించి జీవించమంటుంది.. ముఖ్యమైన విషయాలను చర్చించి తగు నిర్ణయం తీసుకోవటానికి ‘ పెద్దల సభ’ అంటూ ఒకటి ఉండటం మనకు తెలుసు.. ఇంతకూ పెద్దలు అంటే ఎవరు? జవసత్వాలుడిగి కాటికి కాలు చాచిన వారా? చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకసారి ఇలా చెప్పారు.. .. పెద్దల సభ గురించి ఒక శ్లోకం ప్రసిద్ధంగా వుంది..

‘ నాసా సభా యంత్రన సంతి వృద్ధా : నతే వృద్ధా” యే నవదంతి ధర్మం నసధర్మో యత్ర న సత్యమస్తి న తత్ సత్యం యత్ చలేనాను విత్తం’ ..

మొత్తం శ్లోకం యొక్క సారాంశం:
పెద్దలు లేనిది సభ కాదు.. ధర్మం చెప్పలేని వారు పెద్దలు కాలేరు. సత్య రహితమైనది ధర్మం కాలేదు.. కపటి చెప్పేడి సత్యం కాలేదు. ఇట్టి శ్లోకాన్ని లోక్ సభలో , శాసన సభల్లో సూక్తిగా రాస్తే బాగుండును.. అన్ని దేశాలు పాటిచవలసిందే.. 90 ఏళ్ళ వయసున్న వ్యక్తి ఒకరు ఉన్నదనుకుందాం.. అతడు కపటి. అయితే శాస్త్రాలను చదివి మంచి పాండిత్యాన్ని గడించాడు.. మసిపూసి మారేడు కాయ చేయగల సమర్ధుడు.. అతడు చెప్పేదాంట్లో సత్యముండదు.. సత్యం కానిది ఏ విధం గానూ ధర్మం కాదు.. సత్యం చెప్పటంలో, ధర్మాన్ని ఆచరించుటలో పెద్దవాడు కావాలి.. తెలిసి కొన్ని దానిని ఆచరణలో పెట్టినప్పుడే జీవిత పరమార్ధం అని తిరువళ్ళువర్ అంటారు.

  • రాచమాడుగు శ్రీనివాసులు

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాలకు క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/women/