పవన్‌ కళ్యాణ్‌ది అవకాశవాద రాజకీయం!

పవన్‌ ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో, ఎవరిని తిడతాడో తెలియని పరిస్థితి?

avanthi srinivas
avanthi srinivas

విశాఖపట్టణం: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వైఖరిపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ బిజెపితో కలవడం అవకాశవాద రాజకీయమని అవంతి విమర్శించారు. పవన్‌ తీరుపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జుట్టుపీక్కుంట్టున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌ ఎప్పుడు ఎలా మాట్లాతాడో, ఎవరిని తిడతాడో, ఎవరిని పొగుడుతాడో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. కాగా చంద్రబాబు నాయుడు స్కెచ్‌లో భాగంగానే బిజెపిలోకి టిడిపి ఎంపీలను ముందుగా పంపారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ను పంపించారని అవంతి శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాల అభివృద్దే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ధ్యేయమని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/