మదనపల్లెకు నీటి కొరత లేకుండా చేస్తాం

ap cm chandrababu
ap cm chandrababu

మదనపల్లె: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు చిత్తూరు జిల్లాలోపర్యటించారు. చిప్పిలి దగ్గర హంద్రీనీవాకు కోట్లతో పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా హంద్రీనీవా పథకం ఇంజినీర్లును చంద్రబాబు సన్మానించారు. తరువాత చంద్రబాబు మాట్లాడుతు వైఎస్‌ఆర్‌సిపి నేతలు అసెంబ్లీకి రారు. అన్ని విషయాలకు అడ్డుపడతారని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.కొందరు ఏమీ తెలియకుండా ఏదోదే మాట్లాడుతున్నారని బాబు దుయ్యబట్టారు. మదనపల్లెకు నీటి కొరత లేకుండా చేస్తాం. మదనపల్లెకు నీటి సదుపాయం లేక వలసలు పోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి నిలదొక్కుకునే పరిస్థితికి వచ్చాం. 1996లో మొట్టమొదటిసారిగా హంద్రీనీవాకు శ్రీకారం చుట్టాము. హంద్రీనీవా ద్వారా నీళ్లు తెచ్చానంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నదుల అనుసంధానం కోసం రాత్రింబవళ్లు కృషి చేశాను. చేశానన్ని చంద్రబాబు తెలిపారు.