చంద్రబాబు ముఖ్య సలహా దారు చిట్టి నాయుడే

గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా వెళ్లారు

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించడాన్ని తప్పుబడుతూ వైఎస్సాఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. చంద్రబాబునాయుడు ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే (నారా లోకేష్‌) అయి ఉంటాడని అనుకుంటున్నారంతా విజయసాయిరెడ్డి ఏద్దేవా చేశారు. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా రాజు గారి దేవతా వస్త్రాల కథను గుర్తుకోస్తోందన్నారు. తుఫాన్లతో రైతులకు వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని చంద్రబాబునాయుడు ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించటేదూ? అని అన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అంతే ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తారు. అడ్డం తిరగగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. గతంలో అయితే ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా పాడింది పాటగా సాగేదని? అన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/