జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారని అచ్చెన్నాయుడు మండిపాటు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం పట్ల అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ గూండాలు ప్రయత్నించడం దారుణమైన చర్య అని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి.. ఏపీని ఆఫ్ఘనిస్థాన్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు.

గురువారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేస్తూ..చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడం తో అక్కడ టీడీపీ కార్యకర్తలకు – వైసీపీ నేతలకు కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నెట్టువేసుకోవడం , కొట్టుకోవడం చేసారు. వైసీపీ నేతల దాడిలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు. వైసీపీ నేతలు దాదాపు పది కార్లతో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు వాపోయారు. చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకులకు డీజీపీ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదనన్నారు.