పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత : పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం

పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలవరంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం తో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఏ ఒక్కరికి అనుమతి లేదంటూ పోలీసులు అప్పటికే పోలవరం ప్రాజెక్టు ముఖద్వారం వద్ద భారీ వాహనాలతో ఓ బారికేడ్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే చంద్రబాబు అక్కడకు చేరుకోవడం, పోలవరం సందర్శనకు ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు చెప్పడంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలిసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్బంగా పోలిసుల తీరు ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఏ కారణాలతో తనను అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వైస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

తాను చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తనకే అనుమతి ఇవ్వరా? అని పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. అయితే నక్సలైట్లకు చెందిన వారోత్సవాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పిన పోలీసులు.. ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. టీడీపీ హయాంలోనే పోలవరాన్ని 75 శాతం పూర్తిచేశామని, ప్రాజెక్ట్‌ పెండింగ్‌ పనులను కూడా ప్రభుత్వం పూర్తిచేయట్లేదని తప్పుబట్టారు. టీడీపీని విమర్శించడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు మండిపడ్డారు.