అక్క‌డ‌ అండర్ పాస్‌ నిర్మించాలి : నితిన్ గడ్క‌రీకి చంద్ర‌బాబు లేఖ‌లు

కష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు ప‌రిస్థితిపై ఓ లేఖ‌

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీకి రెండు లేఖ రాశారు. కష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను ఆయ‌న అందులో వివ‌రించారు. అక్క‌డ‌ అండర్ పాస్‌ నిర్మించాల‌ని చెప్పారు.

అది లేకపోవడంతో స్థానిక గ్రామాల రైతులు, విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను తెలిపారు. అలాగే, నందిగామ మండలం మునగచర్ల వద్ద అండర్ పాస్ నిర్మాణంపైనా మరో లేఖలో విజ్ఞ‌ప్తి చేశారు. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బందుల‌ను గ‌డ్క‌రీ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవ‌ల జ‌ర్నలిస్టులు కూడా ఈ విష‌యాన్ని చంద్రబాబు నాయుడుకు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: