సిఎం జగన్‌, డీజీపీకి చంద్రబాబు లేఖలు

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు

Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల తీరుపై సిఎం జగన్‌, డీజీపీ సవాంగ్‌కు లేఖలు రాశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు భయానక పరిస్థితులు నెలకొల్పారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. తాడిపత్రిలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరగకుండా చూడాలని ఆయన కోరారు. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జేసీ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వాటిల్లినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పూర్తిస్థాయిలో జేసీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/