సిఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

విశ్రాంత ఉద్యోగులకు పూర్తి పింఛన్ చెల్లించాలంటూ లేఖ

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు సిఎం జగన్‌కు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఏపిలో విశ్రాంతి ఉద్యోగులకు పూర్తి స్థాయి పింఛన్‌ ఇవ్వకపోవడంపై ఆయన డిమాండ్‌ చేస్తూ ఈ లేఖ రాశారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలందించిన వారిపై ఈ తరహా చర్యలు సబబు కాదని, వారికి పూర్తి స్థాయి పింఛన్ చెల్లించాలని అన్నారు. పింఛన్ అందుకునే వాళ్లందరూ 60 ఏళ్లకు పైబడిన వారేనని, ఈ వయసు వారికి ఖకరోనాగ వ్యాపించే అవకాశాలు అధికం అని, వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక వారికి పూర్తి స్థాయి పింఛన్ చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తు లేఖలో పేర్కోన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: