చంద్రబాబు అద్భుతంగా పనిచేశారు : రాహుల్‌

rahul
Rahul congress

హైదరాబాద్‌ ప్రభాతవార్త : సనత్‌నగర్‌లో మహాకూటమి నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే.. ఖతెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్గ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇంత అరాచకం జరుగుతుంటే మోదీని కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ అభివృద్ది పరుగులు తీసిందన్నారు. ఎయిర్‌పోర్టు, రోడ్లు, నీళ్లు, అన్నీ చంద్రబాబు తెచ్చినవేనని పేర్కొన్నారు. చంద్రబాబు పనితీరు అద్భుతం అని కొనియాడారు. టీఆర్ఎస్ పాలనలో మాత్రం నగర అభివృద్ధి తిరోగమిస్తోందన్నారు. ఒక కుటుంబం కోసం నగరాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారని రాహుల్ గాంధీ విమర్శించారు.