4న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఈనెల 4వ తేదీన సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులపై సీఎం వారితో చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చించనున్నట్లు పేర్కొన్నాయి.

ఆర్థికంగా ఒడిదొడుకుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంతో ఆయన వెళ్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చిస్తారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌కు ఒక రూపం ఇవ్వవచ్చన్న అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.