జడ్జి ముందు ప్రతిజ్ఞ చేయనున్న చంద్రబాబు

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: సిఎం చంద్రబాబు విజయవాడ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రతిజ్ఞ చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా సిఎం ప్రచారంలో బిజీగా ఉండడంతో ఆయన నేరుగా వెళ్లి నామినేషన్‌ వేయలేకపోయారు. అందుకు ఆయనకు బదులుగా టిడిపి శ్రేణులు కుప్పంలో రిటర్నింగ్‌ అధికారికి సిఎం చంద్రబాబు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అయితే రూల్ ప్రకారం నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట అభ్యర్థులు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. సీఎం చంద్రబాబుకు అలా చేయనందున న్యాయమూర్తి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/