రాబోయేది మా ప్రభుత్వమే..ఎవర్ని వదిలిపెట్టాం – చంద్రబాబు వార్నింగ్

tdp-chief-chandrababu

రాబోయేది టీడీపీ ప్రభుత్వమే నాని , తప్పుడు కేసులు బనాయించే అధికారులను ఎవర్ని వదిలిపెట్టమని టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులు అయిన వెంకటేష్, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్సులో సోషల్ మీడియా యాక్టివిస్టు సాంబశివరావు తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును చెప్పుకొచ్చారు. ‘‘నా ఇంటికి సీఐడీ పోలీసులు వచ్చి దుర్భాషలాడారు. బెడ్ రూంలోకి వచ్చి అరెస్ట్ చేశారు. స్టేషనుకు తీసుకెళ్లి బట్టలిప్పించారు. నన్ను చిత్రహింసలకు గురి చేశారు.కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం గుండెల మీద తన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని బెదిరించారు. 41ఏ నోటీసు ఇచ్చారు.. బయటకు పంపుతూ.. విచారణ జరుగుతోందని చెప్పమన్నారు. పెద్దొళ్లతో పెట్టుకుంటున్నావ్.. మేం కొట్టినట్టు బయట చెబితే మళ్లీ కేసులు పెడతామని హెచ్చరించారు.’’ అని సాంబశివరావు తెలిపారు.

దీనిపట్ల చంద్రబాబు ఫైర్ అయ్యారు. సీఐడీ పోలీసుల చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు . సుప్రీం కోర్టు నిబంధనలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులు అయిన వెంకటేష్, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని పేర్కొన్నారు.