28న గుంటూరు కార్యాలయానికి వెళ్లానున్న చంద్రబాబు

ap cm chandrababu
ap cm chandrababu

అమరావతి: ఈనెల 28న గుంటూరుకు టిడిపి అధినేత చంద్రబాబు రానున్నారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతారు. అయితే ప్రతి ఏటా ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ సారి మహానాడుత సంబందం లేకుండా ఎన్టీఆర్‌ జయంతిని మాత్రమే 28న నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/