తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం గా బుధువారం బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు..గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న బాబు..రాత్రి అక్కడే బస చేసి.. ఉదయం 09 గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు, సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

నిన్న సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్నప్పటికి, ప్రోటోకాల్ విషయంలో తితిదే అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం వాహనం వద్దకు రాలేదు. సీఎంను అవమానపరిచేలా వ్యవహరించారు. గాయత్రినిలయం భవనం లోపలకు వెళ్లాక, ఇంఛార్జి ఈఓ వీరబ్రహ్మం పూలబొకే ఇచ్చేందుకు యత్నించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆ పూలబొకేను తిరస్కరించారు.