చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌..ముఖ్య నేతలతో చర్చలు

పలు వార్డుల్లో రోడ్డు షోల్లో పాల్గొన‌నున్న చంద్ర‌బాబు

కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న‌ పలు వార్డుల్లో రోడ్డు షోల్లో పాల్గొంటారు. ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి విజ్ఞ‌ప్తులు స్వీక‌రించారు. చంద్రబాబు పర్యటన నేప‌థ్యంలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కుప్పం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల విషయంపైనే ప్ర‌ధానంగా చర్చించే అవకాశం ఉంది.

మరోపక్క, ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి ఉన్న వారు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. నేడు వార్డు సభ్యులను చంద్ర‌బాబు నాయుడు ఎంపిక చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అలాగే, మునిసిపల్ ఎన్నికల్లో వ్యూహాలపై నేత‌ల‌కు ఆయ‌న‌ సూచ‌న‌లు చేయనున్నారు. చంద్ర‌బాబు నాయుడు నిన్న కూడా కుప్పంలో ప‌లు వార్డుల్లో ప‌ర్య‌టించిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/