రేపు గన్నవరం టీడీపీ ఆఫీస్ ను సందర్శినున్న చంద్రబాబు

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం గుడివాడ టీడీపీ ఆఫీస్ ను సందర్శించున్నారు. రీసెంట్ గా వైస్సార్సీపీ శ్రేణులు ఆఫీస్ ఫై దాడి చేసి ఫర్నిచర్ ను , కంప్యూటర్స్ ను తగలబెట్టిన సంగతి తెలిసిందే. అలాగే పార్కింగ్ లో ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టి నానా బీబత్సం చేసారు. వైస్సార్సీపీ కార్యకర్తల చేతిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని రేపు చంద్రబాబు సందర్శించనున్నారు. అలాగే పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఇదిలా ఉంటె గురువారం చంద్రబాబు ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు వెంట యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. చంద్రబాబు గవర్నర్ తో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తనతో పాటు వచ్చిన టీడీపీ నేతలను చంద్రబాబు గవర్నర్ కు పరిచయం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపైనా ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది.