అమరావతిలో చంద్రబాబు పర్యటన

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. టిడిపి హయంలో నిర్మించిన భవనాలు, రహదారి నిర్మాణాలతోపాటు అప్పటి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఆపై ఏమీ మాట్లాడకుండానే, తన కాన్వాయ్ లో అమరావతికి వెళ్లారు. ఇంకా రాజధాని ప్రాంత రైతులతో ఆయన సమావేశం కానున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు పట్టుకుని రైతులు నిరసనలు తెలిపారు. తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ మొత్తం చంద్రబాబు వ్యతిరేక బ్యానర్లతో నిండిపోయింది. వాణిజ్య స్థలాల విషయంలో చంద్రబాబు రైతులను మోసం చేశారని, మళ్లీ ఏం మోహం పెట్టుకుని వస్తున్నారని బ్యానర్లపై క్యాప్షన్లు రాశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/