పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు

విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు

విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు దుండగుల దాడిలో గాయపడ్డ టిడిపి నేత పట్టాభిని పరామర్శించారు. విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌లో ఉన్న‌ ప‌ట్టాభి ఇంటికి చేరుకున్నారు. ప‌ట్టాభిని ప‌రామ‌ర్శించి, ఆయ‌నకు త‌గిలిన గాయాల‌ను ప‌రిశీలించారు. త‌న‌పై జ‌రిగిన దాడి గురించి చంద్ర‌బాబుకు ప‌ట్టాభి వివ‌రించి చెప్పారు. ఆ స‌మ‌యంలో ప‌ట్టాభి మంచంపైనే ప‌డుకుని ఉన్నారు. ప‌ట్టాభి ఇంటికి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, బోండా ఉమా మ‌హేశ్వర‌రావుతో పాటు ప‌లువురు టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా భారీగా చేరుకుంటున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/