పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వైఎస్ఆర్సిపి ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని అన్నారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయమన్నారు. కియా రావడం వైసీపీకి ఇష్టం లేదని పేర్కొన్నారు. కియాకు ఇచ్చే రాయితీలు వైఎస్ఆర్సిపి దృష్టిలో పెనాల్టీనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి బెదిరింపుల వల్లే కియా యూనిట్లు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. జగన్ సిఎం అయ్యాక ఏపీలో దళితులపై దాడులు జరగని రోజు లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సిపి హయాంలో దేవాలయాలపై దాడులు పెరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/