కరోనాపై డాక్టర్లతో చంద్రబాబు చర్చ

వైరస్ నివారణ, ఇతర అంశాలపై డాక్టర్లతో చర్చ

chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపిలోని ప్రముఖ డాక్టర్లతో కరోనా చికిత్స, తదతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కరోనాపై అవగాహన అందరికీ అవసరమని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి, ఇతర అంశాలపై అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నానని తెలిపారు. కరోనాపై ముందు నిలిచిపోరాడుతున్న యోధులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడి పిలుపు మేరకు ఆగస్టు 15న కరోనా మృత యోధులకు నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. గత 2 వారాల్లో ఏపిలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవని పేర్కొన్నారు. డిజిటల్ సోషలైజేషన్, భౌతికదూరం రెండూ ముఖ్యమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

అంబులెన్స్ లు, ఆసుపత్రుల్లోనూ శానిటైజేషన్ ఎంతో ముఖ్యమని అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో తగు వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని తెలిపారు. కరోనా మృతులకు సరైన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రజలకు వేరే ఏ అత్యవసర చికిత్స అవసరం అయినా కరోనా పరీక్ష చేసి కానీ వైద్యం అందించడంలేదని చంద్రబాబు ఆరోపించారు. కరోనా పరీక్షల ఫలితాల కోసం రోగులు వేచి చూడాల్సి రావడం సరైన విధానం కాదని విమర్శించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/