చంద్రబాబు కు పెను ప్రమాదం తప్పింది ..

టీడీపీ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కార్ ను మరో కార్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో ఆయన కు ఎలాంటి గాయాలు కాకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. ‘ఇదేం కర్మ మన రాష్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కాగా బూరుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బంపర్ వంగిపోయింది. చంద్రబాబుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.