రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు బృందం

రాష్ట్రపతి భవన్ కు పలువురు నేతలతో కలిసి వెళ్లిన చంద్రబాబు

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ సీనియర్ నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఘటనలపై రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం నివేదిక అందజేసింది. మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ, ఆర్ధిక దివాళా, ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసుల గులాంగిరి అంశాలపై రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది.

రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి టిడిపి నేతలు విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కేశినేని నాని, అచ్చెన్నాయుడు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర పరిస్థితులు వివరించేందుకు ప్రధాని, హోం మంత్రిని టీడీపీ సమయం కోరినట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/