ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదు

Chandrababu
Chandrababu

బత్తలపల్లి: టిడిపి అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప విమానాశ్రయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతు వైఎస్‌ఆర్‌సిపి నేతలు చేస్తున్న దాడులను ఖండించారు. కార్యకర్తలను కాపాడు కోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదు రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని, దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ క్రమంలోనే బత్తలపల్లి మండలం పత్యాపురంలో ఇటివల హత్యకు గురైన పార్టీ కార్యకర్త బాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం చంద్రబాబు తాడిపత్రి వీరాపురంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు.


తాజా ప్రజవాక్కు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/