చంద్రబాబు ధీక్ష ప్రారంభం

Chandrababu Naidu
Chandrababu Naidu

విజయవాడ: విజయవాడలోని ధర్నాచౌక్‌లో టిడిపి అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఏపిలో ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు భరోసా పెంచేందుకే ఈ దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆయన జవహార్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మరియు మహాత్మగాంధీ, ఎన్టీఆర్‌ చిత్రపటాలకు కూడా చంద్రబాబు పూల మాలలు వేశారు. అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు నివాళులర్పించారు. చంద్రబాబుకు నూలు దండవేసి భవన నిర్మాణ కార్మికులు దీక్షా శిబిరంలో కూర్చోబెట్టారు. ఈ దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. కాగా 12 గంటల నిరసన ధీక్ష కార్యక్రమానికి రాష్ట్రంలోని టిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు ధీక్షకు మద్దతుగా జనసేన, బిజెపితోపాటు వామపక్ష పార్టీలు కూడా తమ మద్దతు ప్రకటించాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/