అధికార పక్షాన్ని నిలదీసిన చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధికి మీరేం చేస్తారో చెప్పండి

అమరావతి: ఏపి అసెెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసమే విదేశాలకు వెళ్లామని ఆయన స్పష్టం చేశారు. తాము చేసిన ప్రయత్నాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల మందికి ఉపాధి దొరికిందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో రూ.16 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని అన్నారు.39 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించడం సరికాదన్నారు. తనను విమర్శించేముందు రాష్ట్రాభివృద్ధి కోసం మీరేం చేస్తారో చెప్పండని అధికార పక్షాన్ని నిలదీశారు.
మరోవైపు డ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపై టిడిపి నిరసనకు దిగింది. ఈ మేరకు కట్ మోషన్లు ప్రవేశపెట్టాలని టిడిపి సభ్యులు నిర్ణయించారు. నిరుద్యోగ భృతి రద్దుకు నిరసనగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కట్ మోషన్ ఇవ్వనున్నారు. మైనార్టీ శాఖకు తగ్గిన కేటాయింపులపై బాల వీరాంజనేయస్వామి, అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రోత్సాహకాల రద్దుపై వల్లభనేని వంశీ కట్మోషన్ ప్రవేశపెట్టనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/