ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేశారు

ఏపీ అంటే పెట్టుబడి దారులు పారిపోతున్నారు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: కేవలం ఎనిమిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్సార్‌సిపి ప్రభుత్వం చెల్లాచెదురు చేసిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు పారిపోతున్నారని, కంపెనిలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను అతలకుతలం చేసిన కరోనా వైరస్‌ను వైఎస్సార్‌సిపి మించిపోయిందని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. సింగపూర్‌ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఆసియా పేపర్‌ అండ్‌ పల్ప్‌, రిలయన్స్‌..అన్నీ ఎనిమిది నెలల్లోనే క్యూకట్టాయని అన్నారు. ఇది చాలదన్నట్టుగా అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖలో మిలీనియం టవర్‌లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుటారట అని ఎద్దేవా చేశారు. ఒక కంపెనీ తెచ్చే సమర్థత లేదు..యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగమూ ఇవ్వని ప్రభుత్వం వైఎస్సార్‌సిపి అని చంద్రబాబు దుయ్యబట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/