హిందూ దేవతల స్థానంలో వైఎస్‌ఆర్‌సిపి రంగులు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను: చంద్రబాబు
భక్తులు ఆగ్రహంతో రగలిపోతున్నారని వెల్లడి

అమరావతిః తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన గోడలపై గతంలో హిందూ దేవతల బొమ్మలు ఉండగా, ఇప్పుడు వాటి స్థానంలో వైఎస్‌ఆర్‌సిపి రంగులు ఉన్న ఫొటోను టిడిపి అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. హిందూ దేవతల స్థానంలో ఏపీ అధికార పక్షం వైఎస్‌ఆర్‌సిపి రంగులు ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. హిందూ మతాన్ని అవమానించాలన్న లక్ష్యంతో ఈ చర్యలకు పాల్పడడంపై భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు అప్పుడు, ఇప్పుడు అనే క్యాప్షన్ తో ఉన్న ఆ ఫొటోను చంద్రబాబు ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/