అమరావతి ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: టిడిపి అధినేత ట్విట్టర్‌ వేదికగా రాష్ట్ర రాజధాని అమరావతిపై స్పందించారు. ప్రజా రాజధానిగా అమరావతిని అద్భుతంగా నిర్మించాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అని అన్నారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు దోహదపడేలా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా ఉపాధి కోసం ఎవ్వరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండకూడదనే సంస్థల చూట్టూ తిరిగి మరి పెట్టుబడులు రాబట్టామని ఆయన అన్నారు. భావితరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల త్యాగాలు వృధా కాకూడదు అని చంద్రబాబు పోస్టు చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/