ఏపీకి వరుస ప్రశ్నలు వేసిన చంద్రబాబు..నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన బాబు..ఈరోజు విశాఖ లో పర్యటించారు. ఈ సందర్భాంగా వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. వరుస ప్రశ్నలు ప్రభుత్వానికి వేశారు. టెన్త్ పేపర్స్ లీక్ ఫై ప్రభుత్వం ఫై ఫైర్ అయ్యారు. మంత్రి బొత్స పేపర్ లీక్ అవుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని , . ఏపీలో కన్నా ఇతర రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. ఇటువంటి అన్యాయం మనం ఎన్నడూ చూడలేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు.

కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాల రంగులు మార్చారని, రంగుల మార్పు కోసం ప్రజాధనాన్ని వృథా చేశారనిచంద్రబాబు మండిపడ్డారు. నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారని, తన పోరాటం తన కోసం కాదని, మీ కోసం అని చంద్రబాబు అన్నారు.పెళ్లి అయితే కళ్యాణ కానుక, పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. జగన్, విజయసాయి వైజాగ్ భూములను ఖబ్జా చేస్తున్నారని విమర్శించారు. ఓ ఫైనాన్సియల్ హబ్, ఐటీ హబ్, టూరిజం, ఫార్మా హబ్ గా విశాఖను దేశంలో అగ్రపథాన నిలబెట్టాలని నేను చూశానని అన్నారు.