హైకోర్టు తీర్పుపై స్పందించిన చంద్రబాబు

chandrababu
chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అమరావతిలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుందని అన్నారు. పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందని ఆరోపించారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారన్నారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/