బాధాకరం..చంద్రబాబు

భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు అంటూ ట్వీట్

sp-balasubrahmanyam-chandrababu

అమరావతి: సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలియగానే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.’ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికే తీరని లోటు’ అని పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/