విజ‌య‌వాడ ఆసుప‌త్రికి చేరుకున్న చంద్ర‌బాబు

అత్యాచారానికి గురైన‌ యువ‌తిని ప‌రామ‌ర్శించ‌డానికి ఆసుప‌త్రికి వెళ్లిన చంద్రబాబు

విజయవాడ : టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు విజయవాడ ప్రభుత్వ ఆసుప‌త్రిలో అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు ఆ హాస్పిటల్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆయ‌న‌ను పోలీసులు బాధిత‌ యువ‌తి వ‌ద్ద‌కు తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, విజయవాడ ప్రభుత్వ ఆసుప‌త్రి వద్ద ఉద్రిక్తత నెల‌కొంది.

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను అక్క‌డున్న టీడీపీ మహిళా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతాన‌ని వాసిరెడ్డి చెప్పారు. చివ‌ర‌కు ఆమెను పోలీసులు బాధితురాలి వ‌ద్ద‌కు తీసుకు వెళ్లారు. దీంతో టీడీపీ మ‌హిళా నేతలు ఆసుప‌త్రి ద్వారం వద్దే బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/