నేడు ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు దీక్ష

పది డిమాండ్లతో నేడు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు

విజయవాడ: కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం దీక్ష చేపట్టనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో 15 మంది సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేయనున్నారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. మరోవైపు సాధన దీక్ష పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టీడీపీ పిలుపునిచ్చింది.

అలాగే, 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దీక్షలో పాల్గొంటారు. మిగిలిన నేతలు ఎవరి నియోజకవర్గాల్లో వారు దీక్షల్లో పాల్గొంటారు. రేషన్ కార్డుదారులకు రూ. 10 వేలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌తో మొత్తం 10 డిమాండ్లతో టీడీపీ ఈ దీక్షలు చేపట్టింది.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/