ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం

కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగ ధీరుడు

ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం
Chandrababu Pays Tributes to NTR

అమరావతి: దివంగత ఎన్టీఆర్‌ జయంతి వేళ చంద్రబాబు ఆయన్ను తలచుకున్నారు. ఈమేరకు ట్విట్టర్‌ వేదికగా ఆయను కొనియాడారు. ‘ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగ ధీరుడు నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం’ అని అన్నారు. ఆపై ‘ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం… తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం.  “సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ల”ని చాటుదాం” అని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/