ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులు

అఖిలేశ్ యాదవ్ ను పరామర్శించిన చంద్రబాబు

chandrababu-pays-tribute-to-mulayam-singh

లక్నోః సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టిడిపి అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ములాయం కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు ఇతర టిడిపి నేతలు గల్లా జయదేవ్, కనకమేడల తదితరులు ఉన్నారు.

ములాయం సింగ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయిలో జరగనున్నాయి. ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి సైఫాయికి వెళ్లారు. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరుతారు. మరోవైపు, మలాయం అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా హాజరవనున్నారు. నిన్న ఉదయం ములాయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/