కీస్తు జన్మదిన వేడుకల్లో చంద్రబాబు

Chandrababu Naidu
Chandrababu Naidu

విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు నగరంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకులకు హాజరయ్యారు. ప్రత్యేక పార్థనలో పాల్గొన్న ఆయన కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ కీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్‌ వేడుకల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త క్రీస్తు. తన పేరుతో ఒక శకానికి నాంది పలికిన క్రీస్తు చరిత్ర పవిత్రం. ఆయన జన్మదినం సర్వ మానవాళికీ పవిత్రదినం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/