నేటి నుండి మూడు రోజుల పాటు చంద్రబాబు నెల్లూరు లో పర్యటన

మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు నెల్లూరు లో పర్యటించనున్నారు. తాజాగా టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రతి పల్లె , పట్టణంలో కొనసాగుతూ.. వైస్సార్సీపీ వైఫల్యాలను ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు..నేటి నుండి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేడు కందుకూరులో పర్యటించనుండగా, రేపు, ఎల్లుండి కావలి, కోవూరులో పర్యటించనున్నారు.

ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 4 గంటలకు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని దివి కొండయ్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తారు. 4 గంటల నుంచి 5.15 వరకు వెంకటనారాయణ నగర్, అంబేద్కర్ విగ్రహం, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.