అరెస్ట్‌ అయిన రైతులను పరామర్శించనున్న చంద్రబాబు

గుంటూరు జిల్లా జైలుకు బయలుదేరిన చంద్రబాబునాయుడు

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి ప్రాంతంలో అరెస్ట్ చేసి, జైలుకు పంపిన ఆరుగురు రైతులను పరామర్శించేందుకు జైలుకు బయలుదేరారు. ప్రస్తుతం వారంతా గుంటూరు జిల్లా జైలులో ఉండగా, చంద్రబాబు జైలుకు వెళ్లి అక్కడికి వెళ్లి వారితో మాట్లాడనున్నారు. ఇప్పటికే రైతుల అరెస్ట్ కు నిరసనగా జైలు ఎదుట మాజీ మంత్రులు ఆలపాటి రాజా, పుల్లారావు, నక్కా ఆనందబాబు నిరసనలు తెలియజేస్తుండగా, వారికి సంఘీభావంగా చంద్రబాబు కూడా నిరసనల్లో పాల్గొననున్నారు. బాబు రాక నేపథ్యంలో జైలు వద్ద బందోబస్తును పెంచారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/