శంకుస్థాపన స్థలం వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారం

Chandrababu Naidu
Chandrababu Naidu

గుంటూరు: ఏపి రాజధాని అమరావతి పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబుకు అక్కడి స్థానిక రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఉద్దండరాయుడిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానించడం కాకపోతే, రాజధాని నిర్మాణం ఆపడం ఏంటి అని ఆయన అన్నారు. అనంతరం వారందరితో కలిసి ప్రధాని మోడి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లిన చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం నిలుపుదలకు వైఎస్‌ఆర్‌సిపి దురుద్దేశం తప్ప, ఇక్కడి పనులు ఆపేందుకు కారణాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని కుట్రపూరితంగానే వైఎస్‌ఆర్‌సిపి సర్కార్‌ నిలిపివేసిందని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపి కుట్రలను చాటిచెప్పేందుకే అమరావతిలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/