నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు..రెండు రోజులు అక్కడే

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి చంద్రబాబు కుప్పం నియోజకవర్గం లో పర్యటించబోతున్నారు. ఈరోజు ..రేపు కుప్పంలోనే బాబు పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు హెలికాప్టర్‌లో PES మెడికల్‌ కాలేజ్‌కు చేరుకుంటారు. కాగా సీఎం హోదాలో వస్తున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు.

కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కుప్పంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రబాబు చెప్పారు. కుప్పంకు చంద్రబాబు ఏయే హామీలు ఇస్తారోనని అందరు చర్చింకుంటున్నారు.