సుహాసినికి మద్దతుగా బాబు

chandra babu naidu
chandra babu naidu

హైదరాబాద్‌  ప్రభాతవార్త : ఏపీ సీఎం చంద్రబాబు నగరంలోని కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహాకూటమి అభ్యర్థి సుహాసినికి మద్దతుగా ఆయన రోడ్ షో‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఖఖటీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారు. వాస్తు పేరుతో కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లలేదు. మూఢ నమ్మకాలు పెట్టుకుంటే పాలన సాగదు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కేటీఆర్ కూడా నన్ను బెదిరిస్తున్నారు. మోదీ, కేసీఆర్‌ లాలూచీపడ్డారు. దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం.గగఅని చంద్రబాబు అన్నారు.