మెడికల్‌ చెకప్‌ కోసం హైదరాబాద్‌కు చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu


హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు మెడికల్‌ చెకప్‌ కోసం నగరంలోని ఏషియన్‌ గాస్ట్రోలజి ఆసుపత్రికి చెకప్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం ఉదయం గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఆసుపత్రికి ఉదయం పరగడుపునే వచ్చి చెకప్‌ చేయించుకుని జూబ్లి హిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. బాబు హైదరాబాద్‌ వచ్చారని తెలిసి టిడిపి నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
జేసి దివాకర్‌రెడ్డి, ఎల్‌ రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. సమావేశం అనంతరం జేసి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/