ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా?

chandrababu
chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఆరు నెలల పరిపాలనపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు తీసుకుందని, అందుకే ప్రతిపక్ష పార్టీగా తాము పోరాటం కొనసాగిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ పాలనలో సాధించింది ఏదైనా ఉందంటే..అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని చంద్రబాబు అన్నారు. ఆరు నెలల కాలంలో దాదాపు రూ.25వేల కోట్లు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ కూడా చేయలేదని విమర్శలు చేశారు. ఒక ఆగస్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సివచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ…తనపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేయటం రాకపొతే సలహాలు తీసుకోవాలి కానీ.. అహంకారంతో ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకొని ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/